ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మనం పంపిన మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. అందుకు గాను అందులో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. మెసేజ్‌లను పంపిన 1 గంటలోగా వాటిని డిలీట్ చేసుకునేందుకు వీలుంటుంది. మనం పంపిన మెసేజ్‌పై హోల్డ్ చేసి పట్టుకుంటే తెరపైభాగంలో డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుంటే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిలీట్ ఫర్ మి, క్యాన్సల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా మనం మెసేజ్‌లను డిలీట్ చేస్తుంటాం.
వాట్సాప్‌లో ఉన్న డిలీట్ ఫీచర్ వల్ల మనం ఎవరికైనా లేదా ఏ గ్రూప్‌లోనైనా అనుకోకుండా పొరపాటున మెసేజ్ పంపితే దాన్ని వెంటనే డిలీట్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్ ను వాట్సాప్ ఎప్పటి నుంచో అందిస్తోంది. ఇక మెసేజ్‌ను డిలీట్ చేసిన చోట దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని కనిపిస్తుంది. అయితే డిలీట్ అయిన మెసేజ్‌లను చూసేందుకు కూడా మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి.
వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను చూసేందుకు పలు యాప్స్ లభిస్తున్నాయి. కానీ వాటి వల్ల మన వాట్సాప్ యాప్‌కు సెక్యూరిటీ ఉండదు. వాటిని ఉపయోగిస్తే మన వాట్సాప్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ ఏమిటంటే.. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లు నోటిఫికేషన్ బార్‌లో కూడా కనిపిస్తాయి కదా. అయితే వాట్సాప్‌లో మెసేజ్‌లను డిలీట్ చేసినా నోటిఫికేషన్ బార్‌లో ఇంకా మెసేజ్‌లను క్లియర్ చేయకపోతే అక్కడ డిలీట్ అయిన మెసేజ్‌లను మనం చూడవచ్చు. ఇలా డిలీట్ అయిన మెసేజ్‌లను చూసేందుకు ఆప్షన్ ఉంటుంది.
ఇక వాట్సాప్‌లో కొన్ని సార్లు ఈ డిలీట్ ఆప్షన్ పనిచేయదు. అందుకు పలు కారణాలు ఉంటాయి. మీరు లేదా అవతలి వారు వాడుతున్న వాట్సాప్ వెర్షన్.. రెండింటిలో ఏ వాట్సాప్ వెర్షన్ పాతది అయినా సరే.. కొన్ని సార్లు డిలీట్ ఫీచర్ పనిచేయదు. అలాగే సమయం మించిపోయాక డిలీట్ చేద్దామనుకున్నా కొన్ని సార్లు ఈ ఆప్షన్ పనిచేయదు. ఈ క్రమంలో ఒక్కోసారి మనకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ కనిపించదు. దానికి బదులుగా డిలీట్ ఫర్ మి అనే ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా యూజర్లు వాట్సాప్‌లో డిలీట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.