మెటా యాజమాన్యంలోని షార్ట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ఇప్పుడు వేగంగా తమ యాప్ లో కొత్త మార్పులు తీసుకొస్తూ తమ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు బిలియన్ల మంది వాడుతున్న ఈ యాప్ వచ్చే ఏడాది నుంచి సరికొత్త ఫీచర్స్ ని కాస్త వేగంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సురక్షితమైన మరియు మెరుగైన ఫీచర్ లను అందించడానికి కాస్త కష్టపడుతుంది. ఇప్పటి వరకు వాట్సాప్ లో పంపిన ఫోటోలకు పలు ఫైల్స్ కు రక్షణ ఉంటుందా అనే దాని మీద అనేక సందేహాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో వాటిని కాపాడేందుకు కాస్త తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా వాటికి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా మరో ఫీచర్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. గ్రూప్ కాల్స్ ఉన్న సమయంలో చాలా మంది పలు కారణాలతో అనుకున్న సమయానికి కాల్ లో జాయిన్ అవ్వలేరు. అయితే కాల్ రన్నింగ్ లో ఉన్న సమయంలో ట్యాప్ టూ జాయిన్ మీద క్లిక్ చేయడం ద్వారా గ్రూప్ కాల్ లో జాయిన్ అయ్యే ఫీచర్ ని తీసుకొస్తుంది.
వాట్సాప్ చాట్ ను ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కు మార్చాలి అంటే కాస్త ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అయితే సి కేబుల్ ఉంటె మాత్రం ఇక ఆ ఇబ్బందులు ఉండవని, ఆ కేబుల్ ద్వారా చాట్ మొత్తాన్ని ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కి బదిలీ చేసే విధంగా ఒక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా వాట్సాప్ ఆండ్రాయిడ్‌లోని చాట్ బ్యాకప్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ మెసేజ్‌ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది, ఈ ఫీచర్ వినియోగదారులు వాటిని పంపే ముందు వాయిస్ సందేశాలను వినడానికి వీలు కల్పిస్తుంది.