ప్రపంచంలో నెం.1 మెసెజింగ్ యాప్ గా ఉన్న వాట్సాప్ మరో కీలక అప్డేట్ తో ముందుకొచ్చింది. 2021లో కొత్త ప్రైవసీ పాలసీతో రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వాట్సాప్… తమ ప్రైవసీ పాలసీని అంగీకరించని యూజర్లకు తమ వాట్సాప్ సేవలను ఫిబ్రవరి 8 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం… ఈ కొత్త ప్రైవసీ పాలసీకి యూజర్లంతా అంగీకరించాల్సిందే. ఈ పాలసీ మీకు అంగీకారమేనా అని వాట్సాప్ మీకు సందేశం పంపుతుంది. అప్పుడు మీరు అంగీకరిస్తే వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. లేదంటే ఫిబ్రవరి 8నుండి మీ మొబైల్ లో వాట్సాప్ ఇక పనిచేయదు.
ప్రముఖ యాప్స్ లలో ఉన్న యూజర్ల డేటా, డేటా భద్రత గురించి ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో… వ్యక్తిగత డేటా భద్రతను కాపాడేందుకు వీలుగా వాట్సాప్ ఈ పాలసీని తీసుకొచ్చింది.