వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో అద్భుతమైన ఫీచర్ ను మన ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఫొటోలు, వీడియోలను మాత్రమే స్టేటస్ లో పెట్టడానికి వీలుండేది. ఇప్పుడు ‘వాయిస్ రికార్డ్ ఇన్ స్టేటస్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అంటే సొంతంగా వాయిస్ రికార్డ్ చేసి, దాన్ని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవచ్చు.
వాట్సాప్ లో 30 సెకన్ల డ్యూరేషన్ వరకు వాయిస్ స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇది త్వరలో యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అలాగే ప్రైవసీ గురించి యూజర్లు అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ఈ వాయిస్ స్టేటస్ ను వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్బమ్ నుంచైనా లేదా వాట్సాప్ స్టేటస్ నుంచైనా వాయిస్ రికార్డ్ చేసుకునే సదుపాయం కల్పించింది. వాట్సాప్ కెమెరా పక్కనుండే వాయిస్ రికార్డ్ సింబల్ నుంచి వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.
అలాగే వాట్సాప్ లో ఇతరులకు పంపిన ఫొటోలు, వీడియోలు ఆటోమెటిక్ గా కంప్రెస్ అయి షేర్ అవుతాయి. ఇప్పుడు తీసుకొచ్చే కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో ఇతరులకు ఫొటోలు పంపే వీలుంటుంది. యూజర్లు ఫొటోను షేర్ చేసే ముందు క్వాలిటీని మార్చుకునేందుకు ఇమేజ్ ప్రివ్యూ సెక్షన్ జోడించనుంది. దీంతో యూజర్లకు తాము పంపే ఫొటోపై పూర్తి నియంత్రణ ఉంటుంది.