విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే 100 కేజీల బరువుండే టైరు ఊడి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విమానంలో ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా? వారికి ఏమయింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఘటన ఇటలీలోని టొరొంటోలో జరిగింది. ఈ విషయాన్ని బ్రెజిల్‌కు చెందిన ఏవియేషన్ బ్లాగ్ ఏరోయిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన బోయింగ్ 747-400 డ్రీమ్ లైనర్ విమానాన్ని యూఎస్ కార్గో ఎయిర్‌లైన్ అట్లాస్ ఎయిర్ నిర్వహిస్తోంది. అయితే ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని టైరు ఊడి కిందపడింది.
ఆ సమయంలో కార్గోజెట్ అండర్ క్యారేజ్ నుంచి నల్లటి పొగ రావడం కూడా కనిపించింది. కిందపడిన టైరును టొరంటో-గ్రోటాగ్లీ ఎయిర్ పోర్టులోని వైన్యార్డ్‌లో గుర్తించారు. బోయింగ్ సంస్థ ఈ ఘటనను ధ్రువీకరించింది. టొరంటో-గ్రోటాగ్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అక్టోబరు 11న ఉదయం విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి వీల్ అసెంబ్లింగ్‌ను కోల్పోయి టైరు ఊడి కింద పడిందని తెలిపింది.
అయితే ఆ తర్వాత విమానం చార్లెస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొంది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇందులో ప్రయాణికులు ఉన్నారా.. లేదా అన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్ వైరల్ గా మారింది.
Boeing 747-400 Dreamlifter tem fogo em um de seus pneus e perde a roda após a decolagem pic.twitter.com/K00lLLf7Bg
— AEROIN (@aero_in) October 11, 2022