దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ ను తాను పెట్టలేదని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదిర్ రంజన్ చౌదరి అన్నారు.
తన అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, ట్వీట్ వారు చేసిన పనే అంటూ ఆయన వివరణ ఇచ్చారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అదిర్ రంజన్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ కనిపించింది.
‘ పెద్ద చెట్టు పడిపోయినప్పుడు, భూమి కంపించిపోతుంది’ అని ట్వీట్ లో రాసి ఉంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఇందిరా గాంధీ హత్య సమయంలో రాజీవ్ గాంధీ ఈ వ్యాఖ్యలను చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి.
‘ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. నేను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాను. ఈ హ్యకింగ్ పై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళుతున్నాను’ అని ఆయన ట్వీట్ పేర్కొన్నారు.