మోడీ సర్కార్ పై బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవీపై ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసే ప్రక్రియలో భాగమేనన్నారు. బిహార్‌లో అధికారం నుంచి బీజేపీని దించేసిన తర్వాత ఇది తాము ఊహించిన ఎత్తుగడేనన్నారు.
బీజేపీ ఓడిపోయినప్పుడు, ఆ పార్టీ తమ మహాకూటమికి వ్యతిరేకంగా నిలబడదని తెలుసుకున్నప్పుడు వెంటనే అది దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతుందన్నారు. ఇప్పుడు మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా చర్యలు ప్రారంభిస్తుందన్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలతో పాటు వారి ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు మరో 12 మందిపై సీబీఐ నిన్న ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు మనీలాండరింగ్ కోణంలో ఈడీ ఆరా తీస్తోంది.