పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిశ్రమలు ముందుకు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని సూచించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మనోహరాబాద్ లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు.
రైతుల ఆదాయం పెంచేందుకే నీలి విప్లవం వచ్చిందని కేటీఆర్ అన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి మనోహరాబాద్ లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు.
అనంతరం ఐటీసీ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. 450 కోట్ల పెట్టుబడితో ఐటీసీ ఈ పరిశ్రమను నిర్మించింది. ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందింది. మనోహరాబాద్ పరిశ్రమ సిబ్బందిలో 50 శాతం మహిళలు ఉన్నారు. పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలన్నారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ఐటీసీ మరిన్ని పరిశ్రమలు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఐటీసీ వంటి సంస్థలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు.