స్మార్ట్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత బ్యాటరీ హీట్ ఎక్కి పేలిపోవడం అనేది గత అయిదేళ్లుగా మనం ఎక్కువగా వింటున్నాం. చార్జింగ్ పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సమయంలో కూడా బ్యాటరీ పేలింది అనే మాట వినపడుతుంది. అసలు ఫోన్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి.
Also Read:తెలంగాణలో ట్విట్టర్ వార్.. రష్యా, ఉక్రెయిన్ ను మించిన యుద్ధం..!
మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంటే: మొబైల్ లో బ్యాటరీ శాతం 20 లేదా 15 కంటే తక్కువ ఉన్న సమయంలో వాడటం మంచిది కాదు. దానికి కారణం ఆ సమయం లో చార్జర్ నుండి ఫోన్ కి వచ్చే వోల్టేజి అలాగే కరెంటు స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫోన్ బ్యాటరీ వేడి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఫోన్ హీట్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు.
మొబైల్ లో పెద్ద ఆప్స్ / గేమ్స్: ఇలా చేసే సమయంలో ఫోన్ సిపియు ఎక్కువగా పవర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బాగా ఫోన్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. ఇలా చేసే సమయంలో ఫోన్ బాటరీ మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఛార్జ్ చేస్తుండే బ్యాటరీ `పాడుకోవడం లేదా పేలే అవకాశాలు చాలా ఎక్కువ.
ఉరుములు లేదా మెరుపులు: ఈ సమయం లో మనం సాధారణ విద్యుత్తును వాడటంతో ఏదైనా బయట షార్ట్ సర్క్యూట్ ఎక్కువ మొత్తం లో ఫోన్ లోకి పవర్ రావటంతో ఫోన్ కాలిపోయే అవకాశాలు ఎక్కువ. ఆ సమయం లో ఇయర్ ఫోన్ ద్వారా చెవి వరకు పవర్ చేరే అవకాశం ఉంది కాబట్టి చెవి కూడా దెబ్బ తినే అవకాశాలు ఉండవచ్చు.
Also Read:జూబ్లీహిల్స్ లో కారు భీభీత్సం..!