ఒకప్పుడు తెలుగు సినిమాలో నటుల మధ్య అనుబంధం చాలా బలంగా ఉండేది. అగ్ర హీరోలతో కింది స్థాయి నటులు కూడా చాలా స్వేచ్ఛగా మాట్లాడటమే కాదు వారి కష్ట సుఖాలను పంచుకునే వారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి ఇలా కొందరు అగ్ర హీరోలకు కింది స్థాయి నటులతో అనుబంధం ఉంది. అలాంటి బంధమే ఒకటి ఎన్టీఆర్ తో రంగారావుకి ఉంది. సాక్షి సినిమాతో తెలుగు సినిమాలో అడుగు పెట్టిన ఆయనకు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఎన్టీఆర్ కోసమే ఆయన సినిమాల్లోకి వచ్చారని అంటారు. ఇక ఎన్టీఆర్ విషయంలో చాలా మందికి ఉన్న అభిప్రాయం… ఆయన ఎవరిని అయినా గారు అని పిలిస్తే వాళ్ళను దూరం పెట్టినట్టు భావిస్తారు. అలా రంగారావుని కూడా ఎన్టీఆర్… రంగారావు గారు అని పిలిచారట.
దీనితో తనను ఎన్టీఆర్ దూరం పెడుతున్నారు అని భయపడ్డారట. అయితే అనుకోకుండా… ఎన్టీఆర్… తనను పిలిచి మాట్లాడారట. క్కడివారు.. ఇప్పటి వరకు ఏం చేశారు. మీరు చాలా అవసరం.. తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది అని ఎన్టీఆర్ మాట్లాడటంతో ఆయన షాక్ అయ్యారు. ఆ తర్వాత సినిమాల్లో పాత్రలకు స్వయంగా ఎన్టీఆర్ ఆయన్ను రిఫర్ చేయడం, ఆయన ప్రూవ్ చేసుకోవడం జరిగాయి. ఎన్టీఆర్ సిఎం అయిన తర్వాత రంగారావుకి మంచి పదవి కూడా వచ్చేదట. కాని రాజకీయ కారణాలతో ఆగిపోయింది.