సినిమా పరిశ్రమలో వ్యక్తుల గురించి ఏ విషయం బయటకు వచ్చినా సరే అది సంచలనంగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఏదోక వివాదం చేయడం మీడియాకు బాగా అలవాటుగా మారింది. అందులో సమంతా, నాగ చైతన్య వ్యవహారానికి సంబంధించి మీడియా బాగా హైలెట్ చేసింది.
Also Read:ఈ కొబ్బరి చిప్పలు కొంటే… చేతికి చిప్పే !
ఇక సమంతా… ట్విట్టర్ లో అక్కినేని అనే ఇంటి పేరు తీసేయడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది ఎవరికి అర్ధం కాలేదు. దాన్ని మీడియా ఒక రేంజ్ లో హైలెట్ చేసి వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత కంటి నిండా నిద్రపోయింది. గత ఏడాది ఇద్దరి మధ్య విడాకుల వ్యవహారం ఒక సంచలనం. ఇక సమంతా, చైతు కలిసి ఉన్న సమయంలో వారి మధ్య ఉన్న అనుబంధాన్ని సమంతా ఎన్నో సందర్భాల్లో బయట పెట్టింది.
అక్టోబర్ 2, 2021న సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించారు. 2019లో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ (తెలుగు)లో ఇంటర్వ్యూలో అనేక విషయాలను సమంతా చెప్పుకొచ్చింది. తన వద్ద రూపాయి కూడా లేని సమయంలో చైతన్య తన దగ్గరకు వచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. తన అమ్మకు ఫోన్ చేయడానికి కూడా ఫోన్ లేకపోతే చైతన్య ఫోన్ నుంచి ఫోన్ చేశా అని గుర్తు చేసుకుంది.
ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించగా… ఆమె కొన్ని ప్రశ్నలు అడిగింది. పెళ్లికి ముందు “లివ్-ఇన్ రిలేషన్షిప్” లో ఉన్నారని లక్ష్మీ ప్రస్తావించగా… చైతన్యకు పిల్లో మొదటి భార్య, నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నా సరే తమకు పిల్లో ఎప్పుడూ మధ్యలో ఉంటుందని చెప్పుకొచ్చింది.
Also Read:లతా మంగేష్కర్ ఆస్తులు ఎంత…? పాట పాడినందుకు బెంజ్ కారు పంపిన నిర్మాత…!