మనిషికి గుండె అనేది అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలో అన్ని భాగాలు ఒక ఎత్తు అయితే గుండె ఒక ఎత్తు. గుండెను ఎంత బాగా కాపాడుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే మాత్రం ఎప్పుడైనా స్వర్గ లోక విహారం చేయవచ్చు. ఇక గుండె సమస్యలు ఉన్న వాళ్లకు ఇప్పుడు ఆపరేషన్లతో పాటుగా గుండె మార్పిడి చికిత్సలు కూడా చేస్తున్నారు.
Also Read:జ్వరం వస్తే చికెన్ ఎందుకు తినకూడదు…? అసలు తినడం మంచిదేనా…?
అయితే ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. అసలు తొలి గుండె మార్పిడి చికిత్స ఎక్కడ జరిగిందో తెలుసా…? సౌత్ ఆఫ్రికాలో. కేప్ టౌన్ లోని గ్రూతే షూర్ హాస్పిటల్ లో జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు క్రిస్టియన్ బెర్నార్డ్. గుండె మార్పుడి జరిగిన మొట్ట మొదటి పేషెంట్ పేరు వాష్కన్స్కీ. కానీ గుండె మార్పు జరిగిన తరువాత వాష్కన్స్కీ పద్దెనిమిది రోజులు మాత్రమే బ్రతికారు.
1967 లో ఈ చికిత్స జరిగింది. అప్పట్లో ఈ గుండె మార్పిడి చికిత్స ఒక అద్భుతం. మీడియా అంతగా లేకపోయినా ప్రజల్లో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇదే ఆసుపత్రిలో జరిగిన మొదటి పది గుండె మార్పిడి జరిగిన రోగులలో నలుగురు ఒక సంవత్సరం కంటే పైగా బ్రతికితే… ఒక రోగి పదమూడు సంవత్సరాలు, మరో రోగి ఇరవై మూడు సంవత్సరాలు బ్రతకడం విశేషం.
Also Read:ప్రజల కన్నీళ్లతో కట్టడాలా.. భూనిర్వాసితుల ఆందోళన..!