కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లను తెలంగాణ వైద్యారోగ్యశాఖ ముమ్మరం చేసింది. తొలుత ఫ్రంట్ వారియర్స్‌కు కరోనా టీకాను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు ఇవ్వనుంది. ఆ తరువాత వరుసగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులకు ఇవ్వనుంది. వారికి వ్యాక్సినేషన్ పూర్తయిన అనంతరం 50 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్ చేపట్టాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే పదహారేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ను అప్పుడే ఇవ్వొద్దని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఆ ఏజ్ గ్రూప్ వారిపై ఇంకా టీకాను ప్రయోగించకపోవడంతో.. ప్రస్తుతం వారికి వ్యాక్సినేషన్ ఉండదని నిపుణులు చెప్తున్నారు. తొలి విడుతలో మొత్తం 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా వ్యాక్సినేషన్‌కు అవసరమైన శిక్షణ ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు పూర్తి కాగా, పీహెచ్‌సీ స్థాయి సిబ్బందికి ఈ నెల 22తో ముగుస్తుంది.