ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వెళ్లారు. వాళ్లింట్లో మటన్ బిర్యానీ ఆరగించి వచ్చారు. జగన్ సతీమణి భారతి స్వయంగా చిరంజీవికి మటన్ బిర్యానీ వడ్డించారంటూ కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత బయటకొచ్చిన చిరు, జగన్ తనకు శుభవార్త చెప్పారని అన్నారు. టాలీవుడ్ కు త్వరలోనే మంచిరోజులొస్తాయని అన్నారు. అక్కడితో ఆగకుండా.. ఏపీలో టికెట్ రేట్ల అంశంపై టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ మాట్లాడొద్దని కూడా సూచించారు. దీంతో చిరంజీవికి గౌరవం ఇచ్చి, టాలీవుడ్ నుంచి ఎవ్వరూ ఆ అంశంపై మాట్లాడలేదు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. చిరంజీవి-జగన్ భేటీ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం టికెట్ రేట్ల ఇష్యూపై ఏర్పాటైన కమిటీ ఏం చేస్తోందనే అంశంపై కూడా క్లారిటీ లేదు. ఒక్క అప్ డేట్ లేదు, కనీసం గాసిప్ కూడా లేదు. ఇలాంటి టైమ్ లో చిరంజీవి స్టేట్ మెంట్ ను కొంతమంది పైకి తీసుకొస్తున్నారు. ఆ మంచి రోజులు ఎప్పుడొస్తాయంటూ అడుగుతున్నారు.
ఉన్నఫలంగా టాలీవుడ్ లో కొంతమంది ఇలా ఈ ఇష్యూపై రియాక్ట్ అవ్వడానికి ఓ కారణం ఉంది. ఈ నెలాఖరు నుంచి పెద్ద సినిమాలు వరుసగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరి 25 నుంచి మే 20 వరకు 3 నెలల పాటు బడా మూవీస్ అన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో మరో 2 వారాలు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. అదే ఇప్పుడు టాలీవుడ్ లో అశాంతికి కారణమైంది.
కచ్చితంగా ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయనే వాదన వినిపిస్తోంది. స్వయంగా కొంతమంది మంత్రులే ఆఫ్ ది రికార్డ్ ఈ మాట చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ రోజు ఎప్పుడు అనేది అసలు ప్రశ్న. పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఏపీలో టికెట్ రేట్లు పెంచినా పెద్దగా ఫలితం ఉండదని, అప్పటికే టాలీవుడ్ నష్టాల్లోకి వెళ్లిపోతుందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి చిరంజీవి చెప్పిన ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందో!