వర్షా కాలం వస్తుంది అంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రాంతాలు వరద భయాలతో ఉంటాయి. ప్రధానంగా గోదావరి పరివాహక జిల్లాలు అన్నీ కూడా ప్రమాదపు అంచునే ఉంటాయి. ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాలు సహా మరికొన్ని జిల్లాలు, కృష్ణా నదీ పరివాహక జిల్లాలు వరద ముప్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో నదికి వరద పెరిగే కొద్దీ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.
Also Read: పంచెతో ప్రిన్సిపల్… జీతం కట్ చేసిన కలెక్టర్
అసలు ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటీ…? గోదావరి నది విషయానికి వస్తే భద్రాచలం, ధవళేస్వరం బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దిగువున ఉన్న ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉండటంతో అధికారులు అలెర్ట్ గా ఉంటుంది. భద్రాచలం వద్ద 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండో హెచ్చరిక, 53 అడుగులు అయితే గనుక మూడో హెచ్చరిక జారీ అవుతుంది. అప్పుడు రెడ్ అలెర్ట్ జారీ అవుతుంది.
ఇక కాటన్ బ్యారేజ్ విషయానికి వస్తే… అక్కడ 11.75 అడుగుల వద్ద ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 13.75 దాటితే రెండో హెచ్చరిక జారీ చేస్తారు. 17.75 అడుగులు దాటితే మూడో హెచ్చరిక జారీ అవుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు కాటన్ బ్యారేజి వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. రెండో హెచ్చరిక సమయానికి 13 లక్షలు, మూడో హెచ్చరికకు 17 లక్షల క్యూసెక్కులను సముద్రానికి వదులుతారు.
ఇక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే నదిలో బోటు ప్రయాణాలు నిషిద్దం, చేపల వేటకు వెళ్ళడంతో పాటుగా లంక గ్రామాల వాసులకు రాక పోకలకు కూడా అవకాశం ఉండదు. రెండో ప్రమాద హెచ్చరిక సమయానికి అధికార యంత్రాంగం అంటే రెవెన్యూ, ఇరిగేషన్ వ్యవస్థలు కలిసి నది గట్లను పరిశీలిస్తారు. మూడో హెచ్చరిక సమయానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం… అంటే జిల్లా కలెక్టర్ నుంచి అన్ని యంత్రాంగాలు సిద్దంగా ఉంటాయి.
Also Read: పానీపూరి తింటున్నారా..? మీకో బ్యాడ్ న్యూస్