భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పోటీగా డానియల్ శేఖర్ పాత్రలో నటించారు దగ్గుబాటి రానా. అరణ్య, 1945 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డ రానా ఇప్పుడు భీమ్లా నాయక్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రానా నటించిన విరాటపర్వం మీద ఉంది.
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవి ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
అయితే గత కొంత కాలంగా నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా విడుదలపై సంతోషంగా లేరని, అందుకే రీషూట్‌కు కూడా వెళ్లారని సంగీత దర్శకుడిని కూడా మార్చారని ఇలా చాలా పుకార్లు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లన్నింటినీ రానా ఖండించాడు. ఇతర సినిమాల రాకను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదల చేయలేదని… మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ పై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
కానీ ఇటీవల కాలంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటన్నింటి మధ్య విరాటపర్వం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. నిజానికి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.