పాక్ లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోయి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. అంతేకాకుండా వారితో పాటు ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు కూడా మరణించారు. ఈ దాడులు గురించి భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ శనివారం తెల్లవారుజామున సంచలన ట్వీట్ చేశారు.
పొరుగు దేశంలో పోలీస్ చీఫ్ కార్యాలయంలోనికే ప్రవేశించి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వెంకటేశ్ ప్రసాద్ పాక్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు టెర్రరిస్టులను పెంచినప్పుడు ఉగ్రవాదుల దాడులను ఎలా ఆపుతారని వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు పాక్ భద్రతా బలగాలు ధీటుగా బదులిచ్చాయని కరాచీ పోలీసులు ట్వీట్ చేశారు.
కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగింది. కరాచీ దాడులపై పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను పంచుకుంటూ, ఉగ్రవాదులను పాక్ దేశంలో పెంచడం కొనసాగించినట్లయితే, పాకిస్తాన్ ఎప్పటికీ అలాంటి చర్యల నుంచి తప్పించుకోలేదని భారత మాజీ పేసర్ ప్రసాద్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఏ విషయంలోనూ నోరు మెదపని పేరున్నవెంకటేష్ ప్రసాద్.. ప్రాణాలు కోల్పోయినవారి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు ఉగ్రవాదాన్ని పెంచినప్పుడు, ఇది తిరిగి వస్తుంది. దేశం ఉగ్రవాదంపై అసహనంతో ఉండలేక ప్రాణాలు కోల్పోతున్న అమాయకులను చూసి బాధపడండి’’ అని ప్రసాద్ ట్వీట్ చేశారు.