ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ ముకర్రమ్ ఝా పార్టీవ దేహాన్ని చార్మినార్ మక్కా మసీదులోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేయనున్నారు. దీంతో మొదటి, ఏడవ నిజాం నవాబులు మినహా మిగతా ఐదుగురు నిజాం నవాబుల సమాధులు మక్కా మసీదులోనే ఉన్నాయి.
నిజాంలు 18వ శతాబద్దం నుంచి 20వ శతాబ్దం వరకు హైదరాబాద్ ను పాలించారు. మొదటి నిజాం మీర్ కమర్ ఉద్ దిన్ కాన్ సమాధి ఔరంగాబాద్ లో, 2వ నిజాం అలీఖాన్, 3వ నిజాం మీర్ అక్బర్ అలీఖాన్, 4వ నిజాం మీర్ ఫర్కుందా అలీఖాన్, 5వ నిజాం మీర్ తహన్ని యత్ అలీఖాన్, 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖన్ సమాధులు చార్మినార్ మక్కా మసీద్ లోనే ఉన్నాయి.
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సమాధి కింగ్ కోఠి మసీద్ లో ఉంది. అలాగే 8వ నిజాం తండ్రి అసఫ్ జా సమాధి కూడా మక్కా మసీద్ లోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముకర్రమ్ ఝా సమాధి కూడా.. తండ్రి అసఫ్ జా సమాధి పక్కనే ఏర్పాటు చేయనున్నారు.