ఫిష్ స్పా” మన ఇండియాలో ఇప్పుడు కాస్త డిమాండ్ పెరిగిన వ్యాపారం. దేశ వ్యాప్తంగా దీనిపై ప్రజలు ఆసక్తి చూపించడంతో ప్రజలకు ఇది క్రమంగా అందుబాటులోకి వస్తుంది అనే చెప్పాలి. ఇక ఈ ఫిష్ స్పాతో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కాస్త ఎక్కువగా జరుగుతుంది. అసలు దీని గురించి తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఫిష్ స్పాని తెలుగులోఆరోగ్యకర చేపలున్న నీటి తొట్టె అలాగే ఔషధ చేప తొట్టె అంటారు.
Also Read:అంగారక గ్రహంపై అవక్షేప శిలలు… నాసా చిత్రాలు వైరల్
ఇందులో వాడే చేప పేరు “గారా రుఫా”. దానికి మరో పేరు కూడా ఉంది. దాన్నే “డాక్టర్ చేప” అని కూడా అంటారు. ఇలా వాడే పద్ధతికి “ఇక్తియో థెరపీ” /చేప వైద్యం అని పేరు. అలాగే “ఫిష్ పెడిక్యూర్” అని కూడా పిలుస్తారు. ఈ వైద్యం మొదట టర్కీ”లో మొదలైనదట. అక్కడ ఈ చేపలు వేడినీటి బుగ్గ లో ఉండేవి. ఒక గొర్రెల కాపరి, ఈ బుగ్గలో కాళ్ళు పెడితే, కాలి కున్న గాయం నయం కావడంతో దాని గురించి ప్రచారం బాగా పెరిగింది. అప్పటి నుండి, దీని చుట్టుపక్కల, అన్ని వసతులతో పెద్ద వసతి గృహాలు, పర్యాటక అవకాశాలు పెరిగాయట.
దీనితో అన్ని చర్మ వ్యాధులు నయమవుతాయని ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా సోరియాసిస్ ,ఎక్జీమ ,వంటివి బాగా నయమౌతాయని ప్రచారంలో మొదలుపెట్టారు. ఈ చేపకి మనుషుల మృత చర్మం ఒక్కటే ప్రధాన ఆహారం కాదు. ఇవి అన్ని రకాల ఆహారం తింటాయి. ఈ చేపలు ఎక్కువగా జంతువుల వృధాను, చెట్ల వ్రుదాను తింటూ ఉంటాయి. అయితే ఈ చేపల కారణంగా కొన్ని అనారోగ్యాలు ఉన్నాయనే వాదన వినపడుతూ ఉంటుంది.
Also Read:బల్మూరి వెంకట్ అరెస్ట్!