టాలీవుడ్ లో ఇప్పుడు నానీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ హ్యాట్రిక్ సినిమాలతో నానీ కెరీర్ ఒకప్పుడు పీక్స్ కి వెళ్ళింది. అయితే కాస్త వైవిధ్యం కావాలి అనుకుని నానీ చేసిన ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి వరుస హిట్ ల కోసం ఎదురు చూస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత ఆ స్థాయిలో చెప్పుకునే సినిమా నానీకి దొరకలేదు.
ఇక నానీకి దర్శకత్వం మీద మంచి పట్టు ఉన్న నేపధ్యంలో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అనే టాక్ ఉంది. కాని ఇప్పుడు ఆ కథలే నానీకి షాక్ ఇస్తున్నాయి. త్వరలోనే హిట్ 3 సినిమా కూడా నానీ మొదలుపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమాలో నానీ పోలీస్ అధికారిగా కనపడుతున్నాడు. ఇదిలా ఉంచితే నానీ హీరో కాక ముందు ఏం చేసేవాడో చాలా మందికి తెలియదు.
దిగ్గజ దర్శకుడు బాపు వద్ద ఆయన రాదా గోపాలం అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసాడు. ఆ తర్వాత కమెడియన్ సునీల్ పుణ్యమా అని శ్రీను వైట్ల దగ్గరకు వెళ్ళాడు నానీ. అతని దగ్గర కూడా కొన్ని రోజులు సహాయ దర్శకుడిగా పని చేసాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణకు నానీతో పరిచయం ఏర్పడింది. అప్పుడు అష్టా చెమ్మ అనే సినిమా చేయగా అది సూపర్ హిట్ అయి నానీ హీరోగా కొనసాగుతున్నాడు.