మన కళ్ళ ముందు కనపడే చిన్న చిన్న విషయాల గురించి కూడా మనం పెద్దగా ఆలోచించం కదా… అలాంటి విషయమే ట్రాఫిక్ సిగ్నల్స్ రంగులు. అది చిన్న విషయమేమీ కాదు గాని… అసలు ఆకు పచ్చ, ఎరుపు రంగులను మాత్రమే ఎందుకు వాడతారు అనేది చాలా మందికి తెలియదు. అసలు దాని వెనుక కారణం, అవి ఎప్పుడు మొదలయ్యాయి ఏంటీ అనేది చూద్దాం.
Also Read:ఆ దోమలతో డెంగ్యూకు చెక్…!
ఇలాంటి ట్రాఫిక్ దీపాల వాడకం అనేది… బ్రిటన్ పార్లమెంట్ భవనాల దగ్గర తొలిసారి 1868 లో మొదలు పెట్టారు. అక్కడ ఎరుపు, ఆకుపచ్చ మాత్రమే వాడేవారు కాని అవి గ్యాస్ తో వేలిగేవి. వాటిని అమర్చిన నెల రోజుల తర్వాత గ్యాస్ లీకేజ్ జరిగి పేలిపోవడం జరిగింది. ఆ తర్వాత విద్యుత్ కి మార్చారు. ఇప్పుడున్న పద్దతిలో వాడటం అనేది… బ్రిటిష్ రైల్వే వాళ్ళు… వాడటం మొదలుపెట్టారు. 1841 లో హెన్రీ బూత్ అనే వ్యక్తి లివర్ పూల్ లో భద్రతా అంశాల పై ఒక దర్యాప్తు చేస్తూ ఈ తరహాలో వాడాలని నిర్ధారించారు.
ఇతర రంగులు అయితే రోడ్డుపై ఉన్న మలినాలకు కనపడకపోవచ్చు అని భావించి ఈ రంగులను తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి బ్రిటన్ లో సమర్ధవంతంగా వాడారు. ఇంగ్లాండ్ పరిశ్రమల్లో సైతం వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత ట్రాఫిక్ లో వాడటం మొదలుపెట్టారు. మరో ప్రధాన కారణం ప్రజల్లో ఈ రెండు రంగుల విషయంలో అవగాహన ఉంది. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అది భయం. ఆకుపచ్చగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచిది అనుకున్నారు. ఆ తర్వాత వీటిని వాడటానికి కారణం మాత్రం ఏ కాలాల్లో అయినా సరే స్పష్టంగా కనపడటం.
Also Read:సామాన్యులు, ప్రతిభావంతులకే పదవులు : బండి