మాజీ టెలికాం మంత్రి ఏ. రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన 5జీ వేలంలో అతి పెద్ద కుంభకోణం జరిగినట్టు ఆయన ఆరోపణలు చేశారు. వేలం ద్వారా మొత్తం రూ. 1.5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.
అమ్మకం ద్వారా రూ. 5 లక్షల కోట్లు ఆదాయాన్ని కేంద్రం అంచనా వేసినట్టు తెలిపారు. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందని ఆయన అడిగారు.
బిడ్లు తెరవడానికి ముందు 22 టెలికాం సర్కిళ్లలో మొత్తం 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం రూ.4.3 కోట్ల రిజర్వ్ ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ రిజర్వ్ ధరలో ప్రభుత్వానికి 35 శాతం మాత్రమే వచ్చిందన్నారు.
రెగ్యులేటరీ అథారిటీ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు తాను 30 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌ను మాత్రమే సిఫార్సు చేశానన్నారు. కానీ అప్పుడు ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వినోద్ రాయ్ నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు 51 గిగా హెడ్జ్ ల స్పెక్ట్రమ్ తక్కువ మొత్తానికి అమ్ముడవుతోందన్నారు. ఈ అన్ని విషయాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మనం దేన్నైనా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు, మనం 2జీ వాడుతున్నప్పుడు 10 సెకన్లలో, 4జీ ఉపయోగించినప్పుడు 5 సెకన్లలో, 5జీల సెకనులో ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
దీన్ని బట్టి 5జీ ఎంత ప్రభావవంతమైందో మనకు అర్థమవుతుందన్నారు. ఈ సామర్థ్యం ఆధారంగా పోల్చినప్పుడు 5జీ వేలానికి కనీసం రూ. 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించి ఉండాలన్నారు.