హడావుడిగా రద్దీగా ఉంటాయి హైదరాబాద్ మార్కెట్ లు అన్నీ కూడా. మనం కొన్ని మార్కెట్ లకు వెళ్తే ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టే ఉంటుంది కదూ…? కోటి, మొజంజాహీ మార్కెట్ లు ఫుడ్ కోర్ట్ లు అబ్బో ఇలా ఎన్నో. అందరికి సరిపడే ఉష్ణోగ్రత కావడంతో సాయంత్రం సమయాల్లో ఇక్కడ రద్దీ చాలా ఎక్కువ. ఇక హైదరాబాద్ లో ప్రముఖంగా వినపడే మరో బజార్ ఒకటి ఉంది.
Also Read:ముందస్తు ముచ్చటే లేదు..!
అదే చోర్ బజార్… హైదరాబాద్ లో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అసలు ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఈ చోర్ బజార్లు ఉన్నాయి. హడావిడిగా, రద్దీగా ఉండే మార్కెట్లను సాధారణంగా “షోర్” (గోలగోలగా/హడావిడిగా) బజార్ అని అంటారు. వెజిటబుల్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు కాకుండా మిగతా అన్నీ (సెకండ్ హ్యాండ్ వస్తువులు, తక్కువ క్వాలిటీ వస్తువులు, యాంటిక్ వస్తువులు, నావేల్టీస్, స్పేర్ పార్ట్స్) దొరికే ప్రదేశం అంటే చోర్ బజార్.
వాస్తవానికి దాని పేరు మార్చి ఇప్పుడు చోర్ చేసారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మన హైదరాబాద్ లో చార్మినార్ దగ్గరున్న శంకర్ బజార్, ఎర్రగడ్డలో ఉండే ఫేమస్ బజార్, సండే మార్కెట్లను చోర్ బజార్లుగా పిలుస్తున్నారు.
మొదటిది: బ్రిటిష్ కాలంలో షోర్ పలకలేక చోర్ అవటం ఒకటి అయితే…
రెండవది: ఈ మార్కెట్లో, దొంగిలించి తెచ్చిన వస్తువులు అమ్మే షాపులు ఎక్కువగా ఉండటం మరో కారణం. ఉండటం.
మన దేశంలో చైనా వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం మధ్య తరగతి వారే కారణం. అలాగే మన దేశంలో చోర్ బజార్ లేకపోతే చాలా మంది కోరికలు తీరేవి కాదు. అయితే ఇక్కడ ఏ వస్తువు అయినా దొరుకుతుంది గాని మోసం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 70 వేల ఫోన్, 499 కి దొరుకుతుంది. లోగో ఉంటుంది గాని అందులో ఫోన్ ఉంటదో ఉండదో మరి. సెకండ్ హ్యాండ్ చెప్పులు, సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి.
Also Read:అధికారపార్టీలో.. ఆగం ఆగం