మంచు ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. అందులోనూ మనోజే స్వయంగా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంట్లోకి వచ్చి విష్ణు వచ్చి ఎలా కొడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ వీడియో షేర్ చేశాడు. దీంతో విరి మధ్య గొడవలు కన్ఫామ్ అంటూ రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీరి గొడవకు కారణం అదీ.. ఇదీ.. అంటూ పలు వార్తలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి.
అయితే మంచు మోహన్ బాబు, విష్ణుతో కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. అందులో విష్ణు.. ‘నాన్నా ఇలా ఒకసారి చూడు’ అంటూ వీడియో తీయగా.. మోహన్ బాబు నవ్వుతూ విష్ణు వైపు చూశాడు. ఈ వీడియోను విష్ణు తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ వీడియో చూసిన పలువురు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు మజోన్ ను వదిలేశాడు.. విష్ణూకే ప్రియారిటీ ఇస్తున్నాడు అని అంటున్నారు. అసలు వీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారంటూ గుసగుసలాడుతున్నారు. మరికొందరు అంతా సర్దుమణిగింది.. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.