ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఎప్పట్లాగే కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది కార్మికులు ఏమాయ్యారు అన్నది ఇప్పుడు అంతుచిక్కటం లేదు. కంపెనీ నుండి గ్యాస్ లీకయినప్పుడు వారంతా బయటకు వచ్చారా…? దట్టమైన పొగకు వారంతా అక్కడే పడిపోయారా…? పొగకు ఎక్కడైనా పడిపోయారా తెలియటం లేదు.
కంపెనీలో మొత్తం 15మంది పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో 5గురు పనిలో ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత కంపెనీ మొదలు పెట్టే ప్రక్రియలో భాగంగా మరో ముగ్గురు టెక్నిషియన్స్ కూడా ఆరోజు ఫాక్టరీకి వెళ్లారు. దాంతో ప్రమాద సమయంలో మొత్తం 8మంది లోపల ఉన్నారు. వారి ఆచూకి ఇంతవరకు లభ్యం కాలేదు.
విషవాయువు మొదట ప్రభావం వారికే తగులుతుంది. కాబట్టి వారికే ఎక్కువ ప్రమాదం. దీంతో వారు ఎమయ్యారు…? ఎలా ఉన్నారు అనేది తెలియటం లేదని సమాచారం. దీనిపై కంపెనీ యాజమాన్యం గానీ, అధికారులు గానీ స్పందించటం లేదు.