సంతోషాన్ని మీరు ఎక్కడ పొందగలరు ? సంతోషం మీకు ఎక్కడ లభిస్తుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు నిజంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎవరికైనా సరే సంతోషం అనేది ఎందులో లభిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి కొన్ని రకాల పనులు చేయడం వల్ల సంతోషం లభిస్తుంది. కొందరికి ఇష్టమైన తిండి తింటే, ఇంకొందరికి ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తే.. సంతోషం కలుగుతుంది. అయితే నిజమైన సంతోషం అనేది ఎక్కడా లభించదు. కానీ దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక పోస్ట్ ద్వారా సమాధానం ఇచ్చారు.
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను ఆయన ట్వీట్ చేస్తారు. ఈ క్రమంలోనే సంతోషం ఎక్కడ లభిస్తుంది ? అనే ప్రశ్నకు కూడా ఆయన ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఆయన ట్వీట్ లో ఆ పోస్టును గమనించవచ్చు.
They say a picture is worth a thousand words? Yes and a simple line drawing is sometimes worth a thousand pictures. pic.twitter.com/cnlBwZrQNz
— anand mahindra (@anandmahindra) November 12, 2020
సంతోషం కోసం నేను అంతటా వెతుకుతున్నాను, నీకెక్కడ లభించింది ? అని కార్టూన్‌లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడుగుతుంటాడు. అందుకు రెండో వ్యక్తి నా అంతట నేను సంతోషం పొందాను, నాకు నేను సంతోషం కలిగేలా సృష్టించుకున్నాను.. అని సమాధానం చెప్పాడు. కాగా ఈ కార్టూన్‌కు ఆనంద్ మహీంద్రా.. కొన్ని వేల పదాల విషయాన్ని ఒకే ఒక్క ఫొటోతో చెప్పవచ్చు కదా, కొన్ని సార్లు సింపుల్ గా లైన్లతో గీసిన చిత్రాలే మనకు వెయ్యి చిత్రాల అర్థాలను చెబుతాయి.. అని అన్నారు.
Yes I believe in that. No one can spoon feed happiness to you. You have to create it for yourself. Like Singing is happiness for me, even though I'm not a professional singer!
— Isha Upadhyay (@isha_015) November 12, 2020
If Humans have a deep and undeniable capacity for Sickness and Evil , then they also have a tremendous capacity for health & goodness, ……but only if they are willing to change !!
— rajeshphophaliya (@rajeshphophalia) November 12, 2020
Absolutely , it can't be procured or exchanged.
— Puneet K Tayal (@PuneetKTayal) November 12, 2020
It’s simple to be HAPPY…but people find it difficult to be SIMPLE.
— Tobu (@Tobu98027951) November 12, 2020
కాగా ఆనంద్ మహీంద్రా పెట్టిన పోస్టుకు ఇప్పటికే 5వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఎంతో మంది ఆ పోస్టును రీట్వీట్ చేశారు. ఆయన పెట్టిన కామెంట్ నిజమే అని నెటిజన్లు స్పందిస్తున్నారు. సంతోషం అనేది ఎవరికి వారు లభించేలా చూసుకోవాలి, అంతేకానీ ఎవరో ఒకరు స్పూన్ ద్వారా తినిపించేది కాదు, ఎవరి సంతోషం వారిది, అందుకు ఎవరికి వారే కష్టపడాలి.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.