మనుషులకు బాగా నోటి దూల ఉంటుంది కదూ… మనకు చులకనగా కనపడిన వాళ్ళు అందరిని చులకనగా మాట్లాడేస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో జంతువులు ఎక్కువ. గాడిదలు, పందులు వంటివి మనకు మరీ చులకనగా కనపడతాయి. కాని వాటి మాంసానికి లేదా వాటి పాలకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాడిద పాలు తాగితే ఉబ్బసం తగ్గుతుంది అనే ప్రచారం అయితే ఇండియాలో గట్టిగా ఉంది.
అందుకే ఆ పాలకు బాగా డిమాండ్ ఎక్కువ. చిన్న గ్లాసు పాలు వంద నుంచి 200 వరకు అమ్ముతారు మన దేశంలో. గాడిద పాలు ఒక్కోక్క లీటర్ 7,000 రూపాయలకు కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ కాలంలో గాడిద బిజినెస్ చాలా మంచి లాభాలు ఇస్తుందనే మాట వినపడుతుంది. రోజుకి లీటర్ పాలు అమ్మినా చాలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంకా అద్రుష్టం ఉంటే ఆ పాలకు డిమాండ్ పెరిగితే గాడిదను పెట్టుకుని అంబాని అవ్వొచ్చు.
మీరు క్యాన్సర్, స్థూలకాయంతో బాధపడుతున్నారా, అయితే గాడిద పాలు మీకు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఒక పరిశోధన ప్రకారం, గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రకాల మందుల్లో గాడిద పాలు వాడతారు. పాలు కొన్ని సౌందర్య ప్రయోజనాలను కూడా ఇస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయట.