ఒక సినిమా రెండు గంటల 30 నిమిషాలకు మించి ఉంటే మనకు హాల్ లో నీరసం వస్తుంది. ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ ఆర్ సినిమా దాదాపుగా 3 గంటల 10 నిమిషాల పాటు ఉండటం తో అభిమానులు బోరింగ్ ఫీల్ అయ్యారు. ఇక మన ఇండియన్ సినిమాలో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. అలాంటి సినిమాలు ఒకసారి చూస్తే…
Also Read:రైలు పట్టాల పక్కన ఈ బోర్డు గమనించారా…? అది ప్రజల ప్రాణాలు కాపాడుతుందా…?
తవమై తవమిరుందు (తమిళం): 4 గంటల 35 నిముషాల నిడివి ఉంటుంది ఈ సినిమా. చెరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్ లో మూడు గంటల ఇరవై నాలుగు నిముషాలు మాత్రమే ఉంటుంది. సినిమా నటుల నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు.
తమస్: కేవలం టీవీ లో ప్లే చేసిన ఈ సినిమా దాదాపుగా 5 గంటల పాటు ఉంటుంది. దూరదర్షన్ లో 1988 లో దీన్ని ప్రసారం చేసారు. తమస్ నవల ఆధారంగా గోవింద్ నిహలాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దూరదర్షన్ లో సీరియల్ మాదిరిగా ప్రసారం చేసారు.
దానవీరశూరకర్ణ: ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిడివి 4 గంటల 17 నిముషాలు.
ఎల్ ఓ సి కార్గిల్: సరిహద్దుల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 4 గంటల 15 నిముషాల పాటు ఉంటుంది.
మేరా నాం జోకర్: రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాలుగు గంటల పైనే ఉంది.
Also Read:వికారాబాద్ బాలిక హత్య కేసులో ట్విస్ట్..!