ప్రజల ఆర్ధిక అవసరాలు పెరగడం, లావాదేవీలు క్రమంగా విస్తరించడంతో చాలా వరకు కూడా ప్రజలు బ్యాంకులకు వెళ్ళడం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ వంటివి చేస్తూ వస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు బ్యాంకుల మీద ఆధారపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య పెరిగింది. అవి ఇచ్చే సేవలు కూడా ప్రజలకు నచ్చడంతో ప్రైవేట్ బ్యాంకుల మీద ఆధారపడుతున్నారు.
Also Read: టీఆర్పీ అంటే ఏంటీ…?ఏ విధంగా లెక్కిస్తారు…?
చాలా మంది ప్రైవేట్ బ్యాంకులు స్పీడ్ గా ఉంటాయనే భావనలో ఉంటారు. వాస్తవానికి ప్రైవేట్ బ్యాంకు కంటే ప్రభుత్వ బ్యాంకు లే వేగంగా సేవలు అందిస్తాయి. అయితే వ్యాపారవేత్తలు లేదా ఆర్ధిక లావాదేవీలు అయితే హై ఎండ్ కస్టమర్లకు కొంత నెమ్మదిగా ఉంటాయనే భావాన్ ఉంటుంది. అయితే సామాన్యులు ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇష్టపడతారు. కాబట్టి వాళ్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి.
ప్రభుత్వ బ్యాంకు ల్లో తక్కువ మంది స్టాఫ్ ఉంటారు. దానికి తోడు ప్రతి గవర్నమెంట్ పథకం ప్రభుత్వ బ్యాంకు తో కలసి ఉండటం కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. పేద వాళ్ళ సబ్సిడీలు DBT లు అన్నీ ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉంటాయి. ప్రయివేటు బ్యాంకుల్లో కేవలం హై ఎండ్ కస్టమర్లు మాత్రమే ఉంటారు. మినిమం బ్యాలన్స్ 5000 పైనే ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో జిరో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో విద్యార్ధుల నుంచి ప్రతీ ఒక్కరు వస్తారు. అందుకే ఆలస్యమవుతూ ఉంటాయి.
Also Read: రజత్ వ్యవహారంపై ఆర్ఎస్పీ రియాక్షన్.. పంచ్ లు మామూలుగా లేవు..!