ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ప్రధానంగా బీపీ కూడా ఒకటి. బీపీ నుంచి బయటపడటానికి జీవిత కాలం మందులు మింగాలి అని చెప్తూ ఉంటారు. అసలు బీపీ కంట్రోల్ లో ఉండాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. బీపీ కంట్రోల్ లో ఉండాలి అంటే కచ్చితంగా పళ్ళు తినాలి. తగ్గించడానికి మనకు ఉపయోగపడే ఫుడ్స్ సిట్రస్, బెర్రీలు, అరటిపండ్లు, దానిమ్మ, ప్రూనే, పుచ్చకాయలు వంటివి.
సిట్రస్: హై బీపీని కంట్రోల్ చేయడానికి ఈ పళ్ళు బాగా సహకరిస్తాయి. విటమిన్ సి తో పాటుగా ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇవి గుండె మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా సహకరిస్తాయి.
బెర్రీలు: అన్ని బెర్రీలు మనకు మంచి చేస్తాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, పాలీఫెనాల్స్‌తో ఉండటం బాగా కలిసి వచ్చే అంశం. రక్తపోటును తగ్గించడంతో పాటుగా, రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
అరటిపండ్లు: ఈ “సూపర్ ఫుడ్స్”లో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయం చేసే యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి.
దానిమ్మ : వలుచుకోవడానికి ఇబ్బంది గాని ఈ పండులో పోషకాలు రక్తపోటు, రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని మనలో బాగా ఎంకరేజ్ చేస్తుంది.
ప్రూనే : వీటిలో పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. సోడియం కూడా తక్కువగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడటమే కాకుండా బీపీని కంట్రోల్ చేస్తుంది.
పుచ్చకాయలు : వేసవిలో విరివిగా దొరికే ఈ కాయల్లో అధిక మొత్తంలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మరియు ఫైబర్ లు ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి.
Advertisements
Also Read: టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ళు ఎవరు…?