చాలా మంది నాన్ వెజ్ తినే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కొందరు తినే అవకాశం ఉన్నా సరే భయపడుతూ ఉంటారు. ఇక మాంసం తినే వాళ్లకు ఏ మాంసం తినాలి ఏంటీ అనే దానిపై మాత్రం అవగాహన లేదు. అసలు ఏ మాంసం తింటే మంచిది…? ఏ మాంసం తినకూడదు అనేది ఒకసారి చూద్దాం. జంతు హింస లాంటి విషయాలను పక్కన పెట్టి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
Also Read:ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
చైనా వాళ్ళ మాదిరి ఏది దొరికితే అది తినకుండా ఉండటం మంచిది. మంసాల్లో పూర్తి ఆరోగ్యకరమైనది గుడ్డు లో తెల్ల సొన. అది పూర్తిగా ప్రోటీన్ ఆహారం. మనకు… సులువుగా జీర్ణం అయి, పూర్తిగా శోషింపబడి మన శరీర నిర్మాణానికి, అదనపు శక్తి కి ఉపయోగపడుతుంది. సాధారణంగా 70 కేజీల బరువున్న ఒక మనిషికి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఇక పిల్లలు, గర్భిణీలకు అది రెండింతలు అవసరం. అందుకే రోజుకి ఒక గుడ్డు తినాలని సూచిస్తూ ఉంటారు.
ఇక మరొకటి చేప… శీతల సముద్రాలలో పెరిగే చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా కొవ్వులతో పాటుగా విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అవి మెదడు ఎదుగుదలకి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక కోడి సహా బాతు వంటివి తినవచ్చు. అయితే ఇప్పటి కోడి మాంసం లో కొవ్వు, ఏంటి బయాటిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. నాటు కోడి వంటివి ఆరోగ్యానికి మంచిది. ఇక కొన్ని రకాల రెడ్ మీట్ కు దూరంగా ఉండాలని లేదంటే జీర్ణ సంబంధిత క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read:దేశాన్ని నడిపిస్తారా? మమత బాటలో నడుస్తారా?