పాలు మానవ ఆరోగ్యానికి ఎంతగానో మంచివి. పాలు రోజు తాగాలి… కాని మంచి పాలు ఏవి, చెడ్డ పాలు ఏవి అనేది చాలా మందికి అవగాహన లేదు. అసలు రోజు మనం కొని వాడే పాల ప్యాకెట్ లు మంచివా కాదా అనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే డైరీ ఫారం దగ్గర కొనే పాలు మంచివా అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి.
Also Read:మాంసంలో ఏది తినడం బెస్ట్…? చికెన్ లో ఏది బెస్ట్…?
పెద్ద పెద్డ డెయిరీ లలో పాలు బాగా రావడానికి అవులకు, గేదెలకు హార్మోన్ ఇమ్బ్యాలేన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో సదరు ఆవు లేదా గేదె చాలా ఎక్కువగా పాలు ఇచ్చి తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతుంది. ఆ పాలు మనం తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. అవి మనం తాగితే… హార్మోన్ సంబంధిత వ్యాధులు, ఇంకా చిన్న వయసులో ఆడ పిల్లలు పెద్ద మనిషి కావడం వంటివి జరుగుతున్నాయి.
ఇక రైతు దగ్గర నీరు కలపని చిక్కటి పాలు క్వాలిటీ పాయింట్స్ ఆధారంగా అర లీటర్ 30 నుంచి 35 రూపాయల వరకు పలుకుతుంది. మనకి కొన్ని బ్రాండ్స్ 25, కొన్ని 30 రూపాయలు లోపు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ట్రాన్స్ పోర్ట్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి చాలా వాటికి కలిపి ఇంకా ఎక్కువ రేటుకి అమ్మాలి. కానీ రైతు కన్నా తక్కువ ధరకు ఇస్తున్నారు కాబట్టి అవి కచ్చితంగా మంచివి కాదు.
Also Read:హౌరాకు బెంగాల్ బీజేపీ చీఫ్… అరెస్టు చేసిన పోలీసులు