జంతువులు అంటే అపరి శుభ్రంగా ఉంటాయనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకే చాలా మంది జంతువులను కాస్త చీప్ గా చూస్తూ ఉంటారు. అయితే జంతువులలో కూడా అత్యంత శుభ్రంగా ఉండే జంతువులను చూద్దాం. పందుల్లో అడవి పంది చాలా శుభ్రంగా ఉంటుంది.
Also Read:పక్కా కమర్షియల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
కాని ఊరుల్లో ఉండే పందులను చూసి పంది అంటే మురికి గుంతలోనే ఉంటుంది అనే భావన ఉంటుంది. అది అడవి పంది విషయంలో నిజం కాదు. అడవి పంది చాలా పరిశుభ్రమైన జీవితాన్ని గడుపుతుంది. తాను ఉండే ప్రదేశంలో ఎప్పుడూ కూడా కాలకృత్యాలు తీర్చుకోదు. చాలా దూరం వెళ్ళి ఆ పనులు చేసుకుని మళ్ళీ తన నివాసానికి వస్తుంది.
అలాగే పిల్లి కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది. పిల్లి మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దానికి ఒసీడీ అనే జబ్బు ఉందని గుర్తించారు. అందుకనే పిల్లి దాని శుభ్రత మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. పిల్లి చర్మం ఏ రంగులో ఉన్నా దాని పైన ఎటువంటి మరకలు కానీ దుమ్మును కాని మనకు కనపడదు. అది ఏదైనా ఎలుకను చంపినప్పుడు కూడా తన శరీరానికి ఎలుక రక్తం అంటకుండా తినే ప్రయత్నం చేస్తుంది.
అలాగే పిల్లికి తెలివి ఎక్కువగా ఉంటుంది. తన శరీరం పట్టని ప్రదేశంలోకి అదెప్పుడూ కూడా వెళ్ళే ప్రయత్నం చేయదు. దాని మీసాల వెడల్పు, శరీర వెడల్పు రెండు ఒకేలా ఉంటాయి. తన మీసాలతో ఆ ప్రదేశాన్ని అంచనా వేసుకుని వెళ్తుంది. మీసాల వెడల్పుతో పోల్చుకుని పరిశీలించుకుని ఆ విస్తీర్ణం మీసాల వెడల్పుకన్నా పెద్దదిగా ఉంటే మాత్రమే వెళ్తుంది. అందుకే పిల్లి ఎక్కడా కూడా ఇరుక్కుపోయినట్టు కనపడదు. అందుకే అనుకుంట దొంగలను పిల్లితో పోలుస్తారు.
Also Read:నిజామాబాద్ బ్యాంకులో జులాయి సీన్ రిపీట్!