రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలు పరిష్కాస్తానని చెప్పినందుకే తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సంచలన కామెంట్ చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చినా అధికారులు ఆదివాసీలను బతకనివ్వటం లేదన్నారు. అధికారులు ఆదివాసీలపై దాడులు చేయవద్దని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినా… దాడులు ఆగటం లేదని, పోడు ఉద్యమంలో తాము వెనుకడుగు వేసే ప్రశ్నే లేదన్నారు.
అటవీ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని, ఆదేశాలివ్వాలని రేగా కాంతారావు కోరారు. లేదంటే ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు.