మార్చి 2020లో కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నియామక ప్రక్రియలో సుదీర్ఘమైన క్షీణతను వైట్ కాలర్ జాబ్ మార్కెట్ చవిచూసింవది. కరోనా నేపథ్యంలో మే నుంచి వరుసగా ఐదు నెలల పాటు ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి సంభవించినట్టు లింక్ డిన్, ఇతర జాబ్ బోర్డు సంస్థల సమాచారం వెల్లడించింది.

పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మాంద్యాన్ని చవిచూడంతో ఈ తిరోగమనం వచ్చినట్టు డేటా ద్వారా తెలిపింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఓపెన్ వైట్ కాలర్ ఉద్యోగ ఖాళీల మొత్తం 210,000కి పడిపోయింది. ఆగస్టు నుండి ఇది 20 శాతనికి తగ్గింది.
గడిచిన 17 నెలల్లో ఇదే అత్యధిక పతనం కావడం గమనార్హం. ఇది గడిచిన 12నెలల్లో 27% తగ్గుదల అని స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్ పెనో సంస్థ అందించిన సమాచారం వెల్లడించింది. మేలో, మొత్తం రకాల ఓపెన్ పొజిషన్లు 330,000గా తెలిపింది. సెప్టెంబర్‌లో వివిధ రకాల ఓపెన్ పొజిషన్‌లు అదనంగా 16 నెలల్లో దిగువకు పడిపోయినట్టు పేర్కొంది.
గ్లోబల్ రిసెషనరీ భయాలు డేటా, సెంటిమెంట్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని మహీంద్రా గ్రూప్‌లోని ముఖ్య ఆర్థికవేత్త సచ్చిదానంద్ శుక్లా అన్నారు. ప్రపంచ డిమాండ్‌తో సంబంధం ఉన్న ఐటీ సేవలు, వస్త్రాలు, రత్నాలు, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు నియామక కార్యకలాపాలు నెమ్మదిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూఎస్, యూరోపియన్ యూనియనల్లో ఆర్థిక మందగమనం వల్ల వీటిపై ప్రభావం పడుతుందన్నారు.
అయితే, బ్యాలెన్స్ షీట్లు బాగా ఉన్న బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) వంటి ప్రత్యక్ష అనుసంధానాలు లేని రంగాలు, 5జీ సేవల ప్రారంభానికి సిద్ధమవుతున్న టెలికాం సంస్థలు, ఆటోమొబైల్స్ రంగాల్లో పెరుగుతున్న వినియోగ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత మానవశక్తి అవసరం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా రంగల్లో నియామక ప్రక్రియ ఊపందుకుంటుందన్నారు.