మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు వచ్చేస్తోంది. అయితే ఈ తెల్లజుట్టును సహజ పద్ధతుల్లో నల్లగా మార్చుకోవచ్చు. చాలా మంది ఎంతో ఖర్చు పెట్టి హెయిర్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిలో వివిధ రకాల కెమికల్స్ ఉండటం వల్ల కొన్ని సార్లు జుట్టుకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.
అందుకే వీలైనంత వరకు తెల్లజుట్టును నల్లగా మార్చడానికి సహజ పద్ధతులనే ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్లజుట్టు నల్లగా మారాడానికి తులసి ఆకులు, కరివేపాకులు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం.. ముందుగా తులసి ఆకులను తీసుకుని… అలాగే ఉసిరి కాయ లేదా దాని ఆకులను, అలాగే గుంటగలగర ఆకులను తీసుకోవాలి. ఈ మూడు సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టంతా అప్లై చేయాలి. ఇది జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది.
కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పుష్కలమైన పోషణను అందిస్తాయి. ఇది చిన్నవయసులోనే వచ్చే తెల్లజుట్టు సమస్యను తొలగిస్తుంది. ఇందుకోసం కరివేపాకు పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే జుట్టుకు రాసుకునే నూనెలో కూడా వీటిని కలపొచ్చు.
నిమ్మకాయలో ఉండే పదార్థాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని రుజువు అయ్యింది. ఆయుర్వేదం ప్రకారం.. 15 మిల్లీలీటర్ల నిమ్మరసం తీసుకుని.. అందులో 20 గ్రాముల ఉసిరి పొడిని కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీనిని జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్ని రోజుల పాటు ఈ పద్దతిని ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.