ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయిన్ కు తక్షణ సహాయంగా 600 మిలియన్ డాలర్లు అందించేందుకు ఉద్దేశించిన మెమోరాండంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఇందులో రక్షణ రంగ కొనుగోళ్లకు 350 మిలియన్ డాలర్లు, మరో 250 మిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా విడుదల చేయాలని స్టేట్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ ను బైడెన్ ఆదేశించారు.
అమెరికా ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇక్కడ జరగుతున్నది యుద్దం. మాకు కావాల్సింది మందుగుండు సామాగ్రి. మీ ఆర్థిక సహాయం కాదు అని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడి తరువాత అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఉక్రెయిన్ అదనపు సహాయాన్ని అభ్యర్థించింది. దీనిపై ఐఎంఎఫ్ స్పందించింది. ఉక్రెయిన్ కు ఆర్థిక సహాయం అందిస్తామని ఐఎంఎఫ్ హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ కు సహాయం అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
ఇక ఇప్పటికే ఉక్రెయిన్ కు ఐక్యరాజ్య సమితి 20 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ నిధులు డోనెట్స్క్, లుహాన్స్క్‌లు, తూర్పు ప్రాంతాల్లో, దేశంలోని ఇతర ప్రాంతాలలో కాంటాక్ట్ లైన్ వెంట అత్యవసర కార్యకలాపాలకు ఇవి పనికి వస్తాయని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ గ్రిఫిత్ అన్నారు.
వీటిని లైఫ్ సేవింగ్ నిధులు అని ఆయన అన్నారు. మహిళలు, బాలికలు, వృద్ధులు, నిరాశ్రయులకు, దాడుల వల్ల ప్రభావితమైన వారికి ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం, ఆహారం ,నీరు వంటి అంశాల్లో సహాయానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల వెంటనే కాల్పుల విరమణను పాటించాలని సూచించారు.