సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసారు. ఆయన హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా చేసిన సినిమాలు అన్నీ సంచలన విజయాలు నమోదు చేసాయి. ఎన్టీఆర్ మరణించినా సరే సినిమా పరిశ్రమలో గాని రాజకీయాల్లో గాని ఆయన మాట వినపడుతూనే ఉంటుంది. ఆయన జీవితం మీద బయోపిక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సినిమా పరిశ్రమలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అలాంటి ఒక నిర్ణయమే గుమ్మడి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాసుకున్నారు. ఎంతో మంది కళాకారులతో సంఘాలు ఏర్పాటు చేయించి.. వేతనంపై పోరాటాలు చేయించారని గుమ్మడి తన ప్రస్తావించారు. 1980లలో ఎన్టీఆర్ మదిలో రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయంలో ఒక పత్రికాధినేత నిత్యం ఆయనను కలుసుకునే వారట.
అప్పటికి.. ఆయన చెన్నైలోనే ఉన్నారట. అప్పటికి అన్నగారికి దాదాపు 60 ఏళ్లు కావడంతో ఈ వయసులో పార్టీ పెట్టవద్దు అనే సలహా ఇచ్చారట. సదరు పత్రికాధినేత ఎన్టీఆర్ కు ఒక సలహా ఇచ్చారు. మీరు పార్టీ పెట్టండి.. సినిమా రంగం నుంచే బోలెడు మంది వచ్చి పార్టీలో చేరతారు అని చెప్పారట. అనుకున్న విధంగా ఎన్టీఆర్ 1982-83 మధ్య పార్టీ పెట్టారు.
కాని పార్టీ పెట్టినా.. అప్పటి కాంగ్రెస్ నేతల ప్రభావంతో సినీమా రంగం నుంచి ఎవరూ పార్టీలో జాయిన్ కాలేదు. ఈ విషయాన్ని పత్రికాధినేత వద్ద ఎన్టీఆర్ ప్రస్తావించగా… మీరు వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పార్టీలో జాయిన్ కావాలి అని అడగండి అని సలహా ఇచ్చారట. తాను ఆ పని చేయను అని ఎన్టీఆర్ అనడంతో చైతన్య రధం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని సలహా ఇచ్చారట. అక్కడి నుంచి సీన్ మారిపోయింది.