కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గంగా ఉన్న కరోనా వ్యాక్సిన్ ను మరో దిగ్గజ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ వ్యాక్సిన్ లిస్టులో చేర్చింది.
ముఖ్యంగా కొన్ని దేశాల్లో సరైన డ్రగ్ రెగ్యూలెటరీ సంస్థలకు ఇది భారీ ఊరటనిచ్చినట్లైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మూడో వ్యాక్సిన్ ఇది కావటం విశేషం. ఇంతకు ముందు ఫైజర్, కోవిషీల్డ్ కు మాత్రమే W.H.O అనుమతి ఉంది. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ కు అమోదముద్ర వేసింది.
ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు అన్నీ రెండు డోసులు తప్పనిసరి. పైగా 20రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రం సింగిల్ డోస్. ఒక్క ఇంజక్షన్ తోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని W.H.O తెలిపింది. పైగా కోల్డ్ చైన్లు వంటి ఇబ్బందులు లేకుండా ఈ వ్యాక్సిన్ ను సరఫరా చేసుకోవచ్చు. నిల్వచేసుకోవచ్చు. 2021 సంవత్సరం చివరి వరకు ఒక బిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని… కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.