గాడ్ ఫాదర్ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని హిట్ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలకు కూడా ఇది మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. పూరి జగన్నాథ్ చేసే సినిమా కూడా లైన్ లో ఉందని అంటున్నారు. ఇక వసూళ్ళ పరంగా కూడా సినిమా మంచి ఫలితం అందుకుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం కాదని చిత్ర యూనిట్ అంటుంది.
గాడ్ ఫాదర్ విషయంలో దర్శకుడు మోహన్ రాజా ప్రతీ ఒక్కటి జాగ్రత్తగా చూసారు. చిరంజీవి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు. సక్సెస్ మీట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సల్మాన్ ఖాన్ కు చిరంజీవి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. తాజాగా చిరంజీవి కొన్ని కామెంట్స్ చేసారు.
తాజాగా చిరంజీవి దర్శకుడు పూరి జగన్నాథ్ తో మొదటిసారిగా ఇంస్టాగ్రామ్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తరంలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరూ అని పూరి అడగగా… నాకు అవగాహన ఉన్నంతవరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు చిరంజీవి. ఆయన మహానుభావుడు అని కొనియాడారు.
ఆయన సింప్లిసిటీ తన జీవితాన్ని దేశ శ్రేయస్సు కోసం అర్పించిన మహానుభావుడు అన్నారు. మహాత్మా గాంధీని ఎలా అయితే అనుకుంటామో అదే విధంగా అదే రోజు పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా గొప్ప రాజకీయుడుగా నేను ఇష్టపడుతూ ఉంటానన్నారు. అలాగే రియల్ స్టేట్ మెన్ అటల్ బిహారీ వాజ్పేయిని కూడా తాను అభిమానిస్తా అన్నారు.