ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. బ్లూమ్ బర్గ్స్ ప్రకటించిన తాజా జాబితాలో 227 బిలియన్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడిగా ఎలెన్ మస్క్ ఉన్నారు.
మస్క్ తర్వాత రెండో స్థానంలో 149 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (138 బిలియన్ డాలర్లు), బిలిగేట్స్ (124 బిలియన్ డాలర్లు) నిలిచారు.
ఇక ప్రముఖ వ్యాపారి, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఈ జాబితాలో టాప్ లోకి వచ్చారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కినెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు.
99.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ ఎనిమిదవ స్థానంలో నిలిచారు. 98.7 బిలియన్ డాలర్లతో గౌతమ్ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో అజీమ్ ప్రేమ్ జీ 42, శివనాడార్ 47వ స్థానంలో నిలిచారు.