సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ అయినా.. డైరెక్టర్ అయినా సినిమాలు తీస్తేనే ఫేమస్ అవుతారు. వారికి గట్టిగా ఒక్క హిట్ పడితే చాలు.. ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతారు. అలా కొంతమంది నటులు, టెక్నీషియన్స్ ఆ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూంటారు. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వాలంటే ట్రెండింగ్ లో ఉన్న హీరోలను తిడితే చాలు. అనుకుంటారు. అందులోనూ మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేస్తే వారే ట్రెండింగ్ లోకి వస్తారు. అలా మెగా ఫ్యామిలీని తిట్టి ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నికృష్ణ..
ఒకప్పుడు టాప్ రైటర్ గా గుర్తింపు పొందిన చిన్నికృష్ణ.. చిరంజీవిని, ఆయన ఫ్యామిలీని బండ బూతులు తిట్టాడు. అసలు చిరంజీవి ఫ్యామిలీ ఎవరికీ సహాయం చేయరని, వారు ఎవరినీ ఎదగనివ్వరంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే చిన్నికృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీలోని చాలా మంది కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి నుంచి సహాయం పొందిన వ్యక్తులు కూడా రియాక్ట్ అయ్యారు. దీంతో చిన్నికృష్ణ ఫేక్ ఆరోపణలు చేశాడంటూ తెలుసుకున్న చాలా మంది చిన్ని కృష్ణను ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేశారు.
పోసాని కృష్ణమురళి..
ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు రైటర్ గా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవాడు పోసాని. ఆ తర్వాత నటుడిగా మారి చాలా సినిమాల్లో నటించి జనాలందరినీ మెప్పించాడు. అయితే పోసాని కూడా మెగా ఫ్యామిలీ మీద కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడాడు. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ.. ఆయన్ని తిట్టాడు. అయితే పోసాని వెనకాల నుండి ఏవో రాజకీయ పార్టీ వాళ్ళు చేయిస్తున్న ఆరోపణలు అని తెలుసుకున్న వాళ్ళు పోసానిని కూడా సినిమాల్లో పెద్దగా తీసుకోవడం మానేశారు.
శ్రీ రెడ్డి..
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ గురించి చెబుతూ రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని భూతులు తిట్టింది. దీంతో ఇండస్ట్రీలో శ్రీ రెడ్డికి ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎవరూ ఇవ్వడం లేదు.
ఇలా ఇండస్ట్రీలో వాళ్లని తిడితే ఫేమ్ అవుతారేమో కానీ.. జనం దృష్టిలో మాత్రం బ్యాడ్ అవుతారు. అలా అవ్వడం వల్ల వాళ్ళకే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని తెలుసుకోలేక సినీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నవాళ్లు చాలా మందే ఉన్నారు.
Also Read: నటరత్న ఎన్టీఆర్ యాడ్స్ లో నటించడానికి ఎంత తీసుకున్నారంటే?