సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిని వదిలిపెట్టి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కామన్ గా చూస్తారు. ఇక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతను చనిపోతే మరో పెళ్లి చేసుకున్న హీరోలు హీరోయిన్లు అనేకం ఉన్నారు. భర్త చనిపోయిన కానీ పెళ్లి చేసుకునే వయసు ఉన్నా వారి జ్ఞాపకాలతో గడుపుతున్న సినీ తారల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో అక్క,వదిన, అమ్మ ఇలా ఎన్నో పాత్రల్లో నటించే సురేఖ వాణి అంటే తెలియని వారు ఉండరు. ఈమె భర్త సురేష్ తేజ 2019లో చనిపోయారు. అయినా ఆమె భర్త జ్ఞాపకాలను మదిలో ఉంచుకొని పెళ్లి చేసుకోకుండా కూతురితో ఆనందంగా జీవిస్తోంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు మరియు సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రాగిణి భర్త కూడా వివాహం జరిగిన కొద్దికాలంలోనే చనిపోయారని తెలుస్తోంది. అయినా రాగిణి అప్పటినుంచి పెళ్లి చేసుకోకుండా తన అక్క పిల్లలతో కాలక్షేపం గడుపుతున్నట్టు సమాచారం.
స్టార్ హీరోగా పేరుపొందిన ఉదయ్ కిరణ్ 2014లో మరణించారు. ఆయన మరణం తర్వాత విషితకు పెళ్లి చేసుకునే వయసు ఉన్నా కానీ పెళ్లి ఊసు ఎత్తకుండా చెన్నైలో జాబ్ చేస్తూ ఉంది.
మరో సీనియర్ యాక్టర్ రోహిణి కూడా భర్త రఘువరన్ తో విడిపోయిన తర్వాత మరో పెళ్లి అయితే చేసుకోలేదు. ఏదో ఒక రోజు ఆయన మళ్లీ కలుస్తారని ఆశించింది. కాని దురదృష్టవశాత్తు రఘువరన్ మరణించడం జరిగింది. అయినా కానీ ఆమె మరో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న డిస్కో శాంతి. స్టార్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. కానీ డిస్కో శాంతి ఆయన జ్ఞాపకాలతో కాలాన్ని వెల్లదీస్తోంది.
ఇటీవల కాలంలో మీనా భర్త విద్యాసాగర్ గారు కాలం చేశారు. అయినా మీనా పెళ్లి ఊసు ఎత్తకుండా తన కూతురును చూసుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. వాటన్నింటి కొట్టిపారేస్తూ సమాధానం ఇచ్చి అలాంటి ఉద్దేశం లేదని చెప్పింది.
భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్. అతనితో విడాకులు తీసుకుంది. తర్వాత ఆదర్శ్ చనిపోయినప్పటికీ ఈమె మరో పెళ్లి చేసుకోలేదు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ .. తన భర్త ముఖేష్ అగర్వాల్ చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోలేదు.
జయసుధ కూడా తన భర్త నితిన్ కపూర్ చనిపోయినప్పటికీ మరో పెళ్లి చేసుకోలేదు. ఆమె ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసమే జీవిస్తుంది. ప్రముఖ నటి కవిత భర్త దశరథ్ రాజ్.. 2021 లో మరణించారు. అయినప్పటికీ ఈమె మరో పెళ్లి చేసుకోలేదు. సుమలత భర్త అంబరీష్ 2018 లో మరణించినప్పటికీ ఈమె మరో వివాహం చేసుకోలేదు.