ఐపీఎల్ అనగానే కొందరికి ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఎక్కువ వికెట్ లు ఎవరు తీస్తారు, ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారు, బెస్ట్ క్యాచ్ ఎవరు పట్టుకుంటారు అనే దాని గురించి కాస్త ఎక్కువ చర్చలే నడుస్తాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ విన్నర్ గా నిలవగా ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ విన్నర్స్ గురించి ఒకసారి చూద్దాం.
షాన్ మార్ష్
పంజాబ్ తరుపున షాన్ మార్ష్ 2008 లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. తొలి సీజన్ లో 616 పరుగులు చేసాడు.
మాధ్యు హేడెన్
2009 సీజన్ లో హేడెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 572 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
సచిన్ టెండూల్కర్
ముంబై తరుపున సచిన్ 2010 లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. ఆ సీజన్ లో సచిన్ 618 పరుగులు చేసాడు.
క్రిస్ గేల్
2011 సీజన్ లో బెంగళూరు తరుపున క్రిస్ గేల్ 608 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
క్రిస్ గేల్
2012 లో ఈ విండీస్ ఆటగాడు సత్తా చాటాడు. ఆ సీజన్ లో క్రిస్ 733 పరుగులు చేసి సంచలనం నమోదు చేసాడు.
మైక్ హస్సీ
2013 లో మైక్ హస్సీ చెన్నై తరుపున ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. ఆ సీజన్ లో 733 పరుగులు చేసాడు.
రాబిన్ ఉతప్ప
2014 లో ఊతప్ప కలకత్తా జట్టు తరుపున ఆడి 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
డేవిడ్ వార్నర్
522 పరుగులతో హైదరాబాద్ జట్టు తరుపున ఆడి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ
2016 లో బెంగళూరు జట్టు తరుపున చెక్కు చెదరని రికార్డ్ నెలకొల్పాడు కోహ్లీ. ఆ సీజన్ లో కోహ్లీయే 973 పరుగులు చేసాడు.
వార్నర్
హైదరాబాద్ జట్టు తరుపున డేవిడ్ వార్నర్ మరోసారి సత్తా చాటాడు. 2017 సీజన్ లో హైదరాబాద్ తరుపున 641 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు.
విలియంసన్
2018 లో హైదరాబాద్ జట్టు తరుపున 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
డేవిడ్ వార్నర్
2019 లో వార్నర్ మరోసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. ఆ సీజన్ లో 692 పరుగులు చేసాడు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ పంజాబ్ తరుపున ఆడి 2020లో 670 పరుగులు చేసాడు.
ఋతురాజ్ గైక్వాడ్
2021 సీజన్ లో గైక్వాడ్ 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
జాన్ బట్లర్
ఈ ఏడాది సీజన్ లో బట్లర్ సునామి సృష్టించాడు. 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.