తమిళ స్టార్ హీరో విక్రం ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే విక్రం నటన కోసం సినిమా చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ భారీ ప్రాజెక్ట్ లతో ముందుకు వెళ్తున్నాడు. పాత్ర ఎలా ఉన్నా సరే దాని కోసం ఏ విధమైన రిస్క్ అయినా చేస్తూ ఉంటాడు. కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడిన విక్రం కి కొన్ని విజయాలు మినహా మిగిలినవి అన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
Also Read:ఢిల్లీ-పూణె స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు
కాని నటుడిగా మాత్రం ఆయన స్థాయిని ప్రతీ సినిమా పెంచింది అనే చెప్పాలి. ఇక విక్రం కెరీర్ విషయానికి వస్తే సేతు సినిమాకు ముందు ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమా వరకు అతనికి హిట్ టాక్ రాలేదు అనే చెప్పాలి. ఆ సినిమాల్లో నటించే వరకు కూడా విక్రం కి పారితోషికం సరిగా వచ్చేది కాదు. ఆ తర్వాత కాస్త కెరీర్ లో సెటిల్ కావడం, సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో రెమ్యునరేషన్ పెరిగింది.
ఇదిలా ఉంచితే… సినిమాల్లో సరైన ఆదాయం లేనప్పుడు కొందరు స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. ప్రభుదేవా, అబ్బాస్, ప్రశాంత్, వినీత్, అజిత్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. అప్పుడు ఆదాయం కాస్త పెరిగింది. ప్రస్తుతం విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సీక్వెల్, కరికాలన్, గరుడ, ధృవ నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు. విక్రం కూడా అప్పుడప్పుడు ఈ విషయాలు చెప్తూ ఉంటాడు.