మహేష్ బాబు కెరీర్ లో సైలెంట్ హిట్ అయిన సినిమా అతడు అనే మాట వాస్తవం. ఈ సినిమా కథ కాస్త బలంగా ఉండటంతో ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు అనే మాట వాస్తవం. సినిమాలో డైలాగ్స్ కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అతడు సినిమాతో మహేష్ బాబు కి మంచి ఇమేజ్ వచ్చింది. ఇక సినిమాలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి.
వాస్తవానికి త్రివిక్రమ్ ఈ కథను రెడీ చేసింది మహేష్ బాబు కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి త్రివిక్రమ్ కథ చెప్తుంటే ఆయన నిద్రపోయారట. ఆ విషయాన్ని ఇటీవల ఒక షోలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత ఇదే కథను ఉదయ్ కిరణ్ కు త్రివిక్రమ్ చెప్పారు. అప్పుడు ఉదయ్ కిరణ్ డేట్స్ ని అల్లు అరవింద్ చూస్తున్నారట. దీనితో తన డేట్స్ గురించి అల్లు అరవింద్ ని అడగాలి అన్నారట.
త్రివిక్రమ్… అల్లు అరవింద్ ని అడిగితే ఆయన డేట్స్ లేవు అన్నారట. ఈ విషయాన్ని మురళి మోహన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇక అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి మహేష్ బాబుకి చెప్పారట. ఆ కథ మహేష్ కంటే కూడా నమ్రాతకి ఎక్కువగా నచ్చడంతో ఆమె ఓకే చేసారు. జయభేరి సంస్థలో మురళి మోహన్ ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో చేయగా మంచి లాభాలు వచ్చాయి.