2021 సంవత్సరానికి సంబంధించి యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు మిస్టర్ బీస్ట్ అనే పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ జిమ్మి డోనాల్డ్ సన్ అత్యధిక ఆదాయం సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
23 ఏళ్ల మిస్టర్ బీస్ట్ గతేడాది ఏకంగా 54 మిలియన్ డాలర్లు పొందాడు. ఆ తరువాత యూట్యూబర్ గా మారిన బాక్సర్ జాక్ పాల్ 45 మిలియన్ డాలర్లు అందుకున్నాడు.
వీరి తర్వాత మార్కిప్లీర్ 38 మిలియన్ డాలర్లతో మూడో స్థానం, 30 మిలియన్ డాలర్ల ఆదాయంతో రెట్ అండ్ లింక్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇక ఐదో స్థానంలో ఉన్న అన్ స్పీకబుల్ 28.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు.