తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేల మంది దర్శించుకుంటూ ఉంటారు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటారు. వారి కోరికలు నెరవేర్చాలని మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ఆలయాన్ని ఎవరు ?ఎప్పుడు నిర్మించారు ? అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలీదు.
తొండమాన్ చక్రవర్తి… కలియుగం ఆరంభంలో తిరుమల ఆలయాన్ని నిర్మించాడని మనకి ఉన్న పురాణాలు చెబుతున్నాయి. తొండమాన్ చక్రవర్తికి ఓ రోజు కల వచ్చిందట. అందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనిపించి తాను కలియుగాంతం వరకు వెంకటేశ్వరుడి అవతారం లో ఉంటానని చెప్పాడట.
అలాగే ఓ ఆలయాన్ని కూడా నిర్మించాలని కలలో స్వామి కోరాడట. దీంతో వెంటనే తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మచే అంగరంగ వైభవంగా ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని వైఖానస ఆగమం ప్రకారం నిర్మించారు. ఆ ఆగమం ప్రకారమే ఇప్పటికీ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి.
అప్పటి హీరోల రెమ్యునరేషన్, సినిమాల బడ్జెట్ ఎంతో తెలుసా ?
తొండమాన్ చక్రవర్తి తరువాత ఎంతోమంది రాజులు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆనంద నిలయం ఉన్న గోపురానికి బంగారంతో అనేకసార్లు ఎంతో మంది రాజులు తాపడం చేశారు. అనేక రకాలుగా ఆలయాన్ని కూడా అభివృద్ధి పరంగా నడిపారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇదే తిరుమల శ్రీవారి ఆలయం వెనుక ఉన్న అసలు కథ.