సినిమా పరిశ్రమలో నటుడు కావాలి అంటే కాస్త రాసిపెట్టి ఉండాలి. ఎందరో ఎదురు చూస్తే ఎప్పుడో అవకాశం వస్తుంది. ఇక రచయితలుగా సినిమాల్లోకి వెళ్ళాలి అంటే నానా కష్టాలు ఉంటాయి. అలా నిలబడిన వాళ్లకు క్రమంగా మంచి పేరు వస్తుంది. అలా రచయితలుగా వచ్చి సినిమాల్లో నటులు అయ్యారు కొందరు. వారికి క్రమంగా మంచి అవకాశాలు వచ్చి స్టార్ నటులు అయ్యారు. వారు ఎవరు అనేది చూద్దాం.
పోసాని కృష్ణ మురళి
దర్శకుడిగా, రచయితగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. పరుచూరి బ్రదర్స్ దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు. అలా పోసాని కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత నటుడిగా కెరీర్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు.
ఎల్బీ శ్రీరాం
మంచి మాటలు, కథల రచయితగా ఆయనకు పేరు ఉంది. ఈవీవీ సత్యనారాయణ నటుడిగా ప్రోత్సహించడం తో సినిమాల్లో నటుడిగా సెట్ అయ్యారు.
ఎం ఎస్ నారాయణ
తాగుబోతు పాత్రలు అంటే ఈ పేరు గుర్తుకు వస్తుంది. ముందు ఆయన రచయితగా వచ్చి ఈవీవీ ప్రోత్సహించడంతో కమెడియన్ అయిపోయారు.
తనికెళ్ళ భరణి
మంచి రైటర్ గా ఆయనకు గుర్తింపు వచ్చింది. దర్శకత్వం మీద కూడా మంచి అభిరుచి ఉన్న రచయిత. నటుడిగా కూడా బాగా సక్సెస్ అయ్యారు. ఏ పాత్రలో అయినా మెప్పిస్తారు. మిథునం అనే సినిమా కూడా డైరెక్ట్ చేసారు.