కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబు నుండే బయటకొచ్చిందని… చైనా ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కరోనా వైరస్ ను వదిలిందని… ఇలా అనేక ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పట్లో అమెరికా సహా పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి.
దేశాల విమర్శలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో పర్యటించింది. చైనా వూహాన్ ల్యాబ్, మార్కెట్లను సందర్శించింది. ఇందులో చైనా శాస్త్రవేత్తల టీం కూడా పాల్గొంది.
తాజాగా అప్పటి స్టడీ రిపోర్ట్ ను W.H.O బహిర్గతం చేసింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం ప్రకారం…వైరస్ జంతువుల నుండే మనుషులకు సోకిందని, ల్యాబ్ నుండి బయటకు వచ్చే అవకాశమే లేదని తెలిపింది. అయితే, ఇది కేవలం డ్రాఫ్ట్ రిపోర్ట్ మాత్రమే కాగా, మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారు.
అయితే, చైనాను దోషిగా చూపించకుండా W.H.O కూడా వారికి సహకరిస్తుందన్న కామెంట్లు మళ్లీ మొదలయ్యాయి.